రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై హైకోర్టులో పిటిషన్

Update: 2020-05-26 14:02 GMT

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై.. సెలెక్ట్ కమిటీ వేయడంలో జాప్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి పిటిషన్ వేశారు. 8 మందితో కమిటీ వేయాలని మండలి చైర్మన్ షరీఫ్‌ ఆదేశించిన విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. మండలి ఛైర్మన్‌ ఆదేశాలు అమలుకావడంలేదని పిటిషనర్ దీపక్‌రెడ్డి పేర్కొన్నారు. మండలి కార్యదర్శి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దీపక్‌ రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు. క్విడ్‌ప్రోకో కింద మండలి కార్యదర్శికి పదవీకాలం పొడిగింపు ద్వారా లబ్ది చేకూరిందని... దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News