ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి

Update: 2020-05-27 13:44 GMT

మే 27వ తేది నుంచి రెండ్రోజుల పాటు జరిగే మహానాడు ప్రతి సారికి భిన్నంగా నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితులకు అనుగుణంగా మహానాడును నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహిస్తున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ చంద్రబాబు కాకుండా వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మరో 6 గురికి మాత్రమే అనుమతి ఉంది. మిగతా వారంతా వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ మృతులకు నివాళులర్పించారు.

Similar News