తమిళనాడులో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 827 కేసులు

Update: 2020-05-28 22:07 GMT

తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తుంది. ప్రతీరోజు 800 పైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 19,372కు చేరుకున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అటు కరోనా మరణాలు కూడా ఇటీవల కాలం నుంచి ఎక్కవగా నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 12 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 145కు చేరింది. అటు కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. అయినా.. ఈ మహమ్మారి కట్టడి అవ్వకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

Similar News