కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. అలా ఉపాధి కోల్పోయిన వారి లెక్కలు సేకరించాలని.. కేంద్రం ఆర్థికశాఖ.. కార్మిక శాఖను కోరింది. ఉపాధి కోల్పోయిన వారితో పాటు.. వేతనాల్లో కోతలకు గురైన వారి వివరాలు కూడా అందించాలని కోరినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంజూరు చేసిన రుణాలకు, పంపిణీ చేసిన రుణాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. కరోనా కట్టడికి కేంద్రం దశలవారీగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. మే31తో లాక్ డౌన్ నాలుగో దశ ముగిస్తుంది. ఇక, లాక్‌డౌన్ 5.0 ను ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.