ఏపీలో కరోనా ఉధృతి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 9504 శాంపిల్స్ పరీక్షించగా.. 70 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురికి కోయంబేడు లింకు ఉన్నట్లు తేలింది. ఇక ఇప్పటివరకు 2092 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా... ప్రస్తుతం 792 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే ఇప్పటివరకు కరోనా బారిన పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు.