హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో హైదరాబాద్ నగరంపై వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. LBనగర్, దిల్‌షుక్‌నగర్, హయత్‌నగర్, మలక్‌పేట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట లో భారీ వర్షం పడింది. కోఠిలో వడగళ్ల వాన కురవడంతో స్థానికులు పరుగులు పెట్టారు.
హైదరాబాద్‌లో భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జాం అయ్యింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిపోయిన నగర జీవికి.. తాజా వర్షం కాస్తా ఉపశమనాన్ని కలిగించింది.