తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల జలదీక్షను అడ్డుకున్న పోలీసులు

Update: 2020-06-02 13:09 GMT

కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న డిమాండ్‌తో... తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు జలదీక్షకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్‌ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలందరినీ హౌస్‌ అరెస్టు చేశారు. కొండగల్‌లో ఎంపీ రేవంత్‌ రెడ్డిని హౌస్‌ అరెస్టు చేశారు పోలీసులు. అటు మహబూబ్‌నగర్‌ శ్రీనివాస కాలనీలో హర్షవర్దన్‌ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్వహించతలపెట్టిన జలదీక్షను పోలీసులు రద్దు చేశారు. దీంతో జిల్లా పార్టీ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్క జలదీక్షకు దిగారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌నేతల హౌస్ అరెస్టును.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఖండించారు. SLBC ప్రాజెక్టు వెళ్లేందుకు ఆయనకు అనుమతించారు. ఆవిర్బావ దినోత్సవం నాడు.. ఇళ్ల వద్ద నేతలను అరెస్టు చేయడం దారుణమని ఉత్తమ్‌ అన్నారు.

నాగర్‌ కర్నూల్‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం ఇంటి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలదీక్షలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన నాగంను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు, నాగంకు మద్య వాగ్వాదం జరిగింది.

Similar News