రాత్రి 8 గంటల వరకు దుకాణం తెరిచే ఉంటుంది.. ఇక మీ ఇష్టం..

Update: 2020-06-02 13:39 GMT

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ సోమవారం అన్ని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మే 6 నుంచి మద్యం షాపులు తెరుచుకున్నా కర్ఫ్యూ కారణంగా మందు బాబులు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వం మరిన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపింది. రెస్టారెంట్లు, మాల్స్ తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పాటు ఇప్పటి వరకు ఉన్న కర్ఫ్యూ వేళలను కూడా మార్చింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ప్యూ సమయాన్ని మార్చారు. దీంతో మద్యం షాపుల సమయాన్ని కూడా పెంచి వారికి కాస్త ఉపశమనం కలిగించింది ప్రభుత్వం.

Similar News