తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Update: 2020-06-02 13:33 GMT

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారం రోజులు ముందు నుంచే ఆవిర్భావ దినోత్సవ వేడుకకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సిరిసిల్ల బస్టాండ్ వద్ద అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు.

Similar News