గుజరాత్ లో ఓ కెమికల్ ఫ్యాక్టీరీలో అగ్నిప్రమాదం జరిగింది. దహేజ్ పారిశ్రామక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఈప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు వ్యాపించి 40 మంది కార్మికులు తీవ్రగాయాలపాలైయ్యారు. స్థానికులు సమాచారం అందించడంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకొని 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. అయితే, భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పేలుడు వలన విషవాయువులు వాతావరణంలోకి చేరడంతో..అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.