తెలంగాణలో కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి.. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పలువురికి కరెంటు బిల్లులు వేలు, లక్షల్లో వచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లులు చెల్లించడంలో ఒకటి రెండు నెలలు ఆలస్యమవ్వడంతో.. ఇప్పుడు వస్తున్న బిల్లులు చూసి వినియోగదారులు షాక్ తింటున్నారు. మరిపెడకు చెందిన వస్రాం అనే వినయోగదారుడికి 2 లక్షల 16 వేల 695 రూపాయలు వచ్చింది. బుజ్జి అని మరో వ్యక్తికి 26 వేల రూపాయలు వచ్చింది. అదే డిపార్ట్‌మెంట్ లో లైన్‌మెన్‌గా పని చేసి రిటైర్ అయిన రాంశనాయ్‌కు కూడా 7 వేల బిల్లు వచ్చింది. దీంతో బాధితులు విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.