సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలి: హరీష్ రావు

Update: 2020-06-07 20:09 GMT

సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి ఆహార పదార్థాలు తీసుకురావడం వల్ల అనారోగ్యం తప్పదని ఆయన హెచ్చరించారు. వర్షాకాలంలో దోమలు పెరగకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు పొంచివుంటాయని ఆయన చెప్పారు. అందుకే దోమలు పెరగకుండా ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హరీశ్ రావు సూచించారు. సిద్దిపేటలో స్టీల్‌ బ్యాంకును ప్రారంభించిన మంత్రి.. మహిళలకు స్టీలు పాత్రలను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడబోమంటూ మహిళలతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

Similar News