భూ వివాదం కేసులో తహసీల్దార్‌ అరెస్టు

Update: 2020-06-08 22:09 GMT

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి నేరుగా ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకు ముందు తహసీల్దార్‌ సుజాతను ఇదే అంశంపై మూడు రోజులపాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. తనిఖీల సందర్భంగా ఆమె ఇంట్లో లభించిన 30 లక్షల రూపాయలు ఎలా వచ్చాయనే దానిపై ఆమెను ప్రశ్నించారు.. అయితే, ఆ డబ్బంతా తాను జీతం రూపంలో సంపాదించినదేనని ఆమె చెప్పారు. ఆ తర్వాత వీఆర్‌వోను కూడా ప్రశ్నించిన అధికారులు విచారణ అనంతరం తహసీల్దార్‌ను అరెస్టు చేశారు. అంతకు ముందు ఇదే కేసులో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్రనాయక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. తహీసల్దార్‌ అరెస్టుతో ఈ సంఖ్య మూడుకు చేరింది.

Similar News