ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఫైరయ్యారు. లాక్ డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.