మరోసారి డబుల్‌ సెంచరీ దాటిన తెలంగాణ కరోనా కేసులు

Update: 2020-06-11 23:35 GMT

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజే కొత్తగా 209 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 175 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. మేడ్చల్‌ 10, రంగారెడ్డి 7, మహబూబ్‌నగర్‌ 3, కరీంనగర్‌ 3, వరంగల్‌ అర్బన్‌ 2, ఆసిఫాబాద్‌ 2, సిద్ధిపేట 2 కేసులు నమోదయ్యాయి. ములుగు,కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయింది. ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 165 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,320కు చేరింది.

Similar News