అసలే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపై కరోనా మహమ్మారి కూడా ఆ విద్యార్థిపై దాడి చేసింది. సిద్ధిపేట మిరుదొడ్డి మండల పరిధిలోని జంగంపల్లి గ్రామానికి చెందిన జెడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అఖిల్ అనే విద్యార్థి గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇరవై రోజుల నుంచి హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలోనే కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు.