ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అచ్చెన్నను అరెస్ట్ చేశారు : శ్రీనివాసులు రెడ్డి

Update: 2020-06-12 17:24 GMT

ఓ నిబద్ధతగల ప్రతిపక్ష నాయుకుడిని.. అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.. టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి. ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు.. సూర్యోదయానికి ముందే అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నమని అన్నారు. అయితే, పార్టీ ఎప్పుడూ బలహీనపడదని.. గతంలో ఇలాంటి ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టామని అన్నారు. ఓ నిజాయితీగల నాయకుడిని అరెస్ట్ చేయడం బాధాకరమన్న శ్రీనివాసులు రెడ్డి.. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

Similar News