విశాఖలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విశాఖ తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే వెగలపూడి రామకృష్ణ బాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. రోడ్డు శంకుస్థాపన చేస్తున్న రామకృష్ణబాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కొందరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచారు. తమపై రాళ్లదాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణబాబు చేశారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.