కేరళలోని మల్లుపురంలో లాఠీఛార్జ్ కలకలం రేపింది. పాఠశాల విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు విద్యార్ధి నేతలు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఒక్కసారిగా లాఠీఛార్జ్‌కు దిగారు. ఈ ఘటనలో పలువురు విద్యార్ధి నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. నిరసనలో పాల్గొన్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల లాఠీఛార్జ్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.