గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల మయమని ఆరోపించారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు పట్ల దారుణంగా వ్యవహరించారని మాజీ మంత్రి పత్తిపాటి మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు