కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే.. కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా టెస్టుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు వచ్చేసరికి టెస్టుల సంఖ్య పెంచారని అన్నారు. తనదాకా వస్తేగాని స్పందించరా అంటూ మండిపడ్డారు. కరోనా చికిత్సకు పేద, మధ్యతరగతి ప్రజలు వేల రూపాయలు ఎలా ఖర్చు చేయగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కరోనా ప్రభలుతుందని అన్నారు.