మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, ప్రస్తుతం తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోరగా.. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్‌పై ఒకేసారి విచారించాలని ప్రభుత్వ అడ్వొకేట్ కోరారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.