పెద్దల సభకు మంచి వ్యక్తులను పంపాల్సిన అవసరముందున్నారు టీడీపీ నేత, రాజ్యసభ అభ్యర్ధి వర్లరామయ్య. తనను గెలిపిస్తే పేదలు, దళితుల గొంతుకను రాజ్యసభలో వినిపిస్తానన్నారు. ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదం ప్రకారం తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. వైసీపి పార్టీ అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారిని అభ్యర్ధులుగా నిలబెట్టిందన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.