పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వెంటనే వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. కరోనాతో ప్రజలు, వ్యాపారులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని అన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి డిజీల్, పెట్రోల్ రేట్లను పెంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. పెట్రో రేట్లను తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు.