చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వలన మనకు లాభం లేదు: చిదంబరం

Update: 2020-06-21 19:25 GMT

చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వలన.. ఆదేశానికి జరిగే నష్టం పెద్దగా ఉండదని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొనడంతో.. డ్రాగన్ కంట్రీకి సంబందించిన ఉత్పత్తులను బహిష్కరించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ముబైల్ లో చైనా యాప్స్ తొలగిస్తున్నారు. అయితే, ఇలాంటి నిర్ణయాల వలన చైనా పెద్ద జరిగే నష్టం ఏమీ లేదని.. చైనా చేస్తున్న వ్యాపారాల్లో భారత్ లో చాలా తక్కవగా మాత్రమే జరుగుతుందని.. అందువల్ల ఆదేశానికి వచ్చేనష్టం పెద్దగా ఏం ఉండదని అన్నారు. మనం ఒకరిపై ఆధారపడకుండా.. స్వయం ఆధారిత దేశంగా ఎదగడానికి ప్రయత్నించాలే కానీ.. ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకోవడం వలన మనకు వచ్చే ఉపయోగం లేదని అన్నారు. ప్రపంచీకరణలో భారత్ భాగంగా ఉండాలని చిదంబరం సూచించారు.

Similar News