ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటలనుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 16,704 శాంపిల్స్ ను పరీక్షించగా 392 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7451 కు చేరింది. అలాగే కొత్తగా కృష్ణలో ఒకరు, కర్నూల్ లో ఒకరు, అనంతపురంలో ఒకరు ,
పశ్చిమ గోదావరిలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దాంతో మరణాల సంఖ్య 111కు చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 83 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ 3437 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3903గా ఉంది.