ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

Update: 2020-06-23 16:37 GMT

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 20,639 శాంపిల్స్ ను పరీక్షించగా. కొత్తగా మరో 407 మందికి పాజిటివ్ ఉన్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7858కి చేరింది.

అలాగే సోమవారం 129మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3566 మంది కోలుకుని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 4173 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కృష్ణలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు , గుంటూరు లో ఒకరు కోవిడ్ కారణంగా మరణించారు. దాంతో ఇప్పటివరకూ 119 మంది మృతి చెందారు.

Similar News