తెలంగాణలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 652 ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరింది. కరోనాతో కొత్తగా మరో ముగ్గురు మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 220గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,224 మంది కరోనానుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 5,109 యాక్టివ్ కేసులు ఉన్నాయి.