మెరుగుపడిన ఢిల్లీ మంత్రి ఆరోగ్యం

Update: 2020-06-22 20:37 GMT

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స అందించామని.. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో జనరల్ వార్డుకు తరలించామని అన్నారు. సత్యేంద్ర జైన్ జూన్ 17న కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. అయితే, ఆయన అప్పటికే న్యూమేనియాతో బాధపడటంతో ఆయనను ఐసీయూలో చికిత్స అందించారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చేయడంతో.. ఆరోగ్యం కాస్తా కుదుటపడింది. దీంతో ఆయనను జనరల్ వార్డుకు పంపించారు.

Similar News