మాజీ మంత్రులు యనమల, చినరాజప్పలపై నమోదైన అట్రాసిటీ కేసులో హైకోర్టు స్టే ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, కుమారుడిపై నమోదైన.. అట్రాసిటీ కేసులోనూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎవరినీ అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసులో తర్వాతి చర్యలపై కూడా స్టే ఇచ్చింది. టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.