నర్సాపూర్‌లో తెలంగాణ ఆరవ హరితహారాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Update: 2020-06-23 14:36 GMT

ఈ నెల 25న మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో.... సీఎం కేసీఆర్‌ ఆరవ తెలంగాణ హరితహారాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అటు... ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి హరీష్‌రావు. నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మధన్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మీరెడ్డి ఉన్నారు. పార్క్‌లో ఏర్పాటు చేసిన వాచ్‌ టవర్‌, చెక్‌డాంలను పరిశీలించారు. ఈ సారి హరితహారం కార్యక్రమంలో.. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు అడవి పునరుద్ధరణ నర్సరీల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు.

Similar News