గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. పొన్నూరు నియోజకవర్గం జాగర్లమూడి క్వారీని ఆయన పరిశీలించారు.. ఒక్కరోజులోనే 9వేల క్యూబిక్‌ల గ్రావెల్‌ను తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇష్టానుసారంగా మట్టిని తవ్విపోస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.. నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.