ఆగస్ట్ వరకు రైలు రాదంట..

Update: 2020-06-24 19:23 GMT

కొవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి కారణంగా రైళ్ల రాకపోకలను రద్దు చేసింది దేశ రాజధాని దిల్లీ సర్కారు. దేశీయ విమాన రాకపోకలకు అనుమతులు లభించినా.. రైళ్లకు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకు అనుమతులు లభించవని తెలిసింది. ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని టికెట్లను రద్దు చేయాలని అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకుంది రైల్వే శాఖ. ఇప్పటికే బుక్ చేసుకున్న వారి టిక్కెట్ల డబ్బును రిఫండ్ చేయాలని సూచించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను ప్రత్యేక రైళ్లుగా గుర్తిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Similar News