వైసీపీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నీతి, నిజాయితీ నేతలుగా పేరున్నవారిని కూడా అరెస్ట్ చేయించారని గుర్తుచేశారు. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత జగన్ ప్రభుత్వంలో మళ్లీ అలాంటి ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో దర్జాగా పాదయాత్రలు చేసుకున్న జగన్.. తాను అధికారంలోకి రాగానే చంద్రబాబును బయటికి వెళ్లనివ్వకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కోట్ల రూపాయల స్కాం అనే ఆరోపణలతో అచ్చెన్నాయుడు ఇంట్లోకి 300 మంది పోలీసులు చొచ్చుకెళ్తే.. మరి 43 వేల కోట్లు కొట్టేసిన వ్యక్తి ఇంటికి ఎంతమంది పోలీసులు వెళ్లాలి అని ప్రశ్నించారు వర్ల రామయ్య.