మైనర్ బాలిక పట్ల ఓ మహిళ వికృత చర్యలు

Update: 2020-06-28 18:56 GMT

మైనర్ బాలిక పట్ల ఓ మహిళ వికృత చర్యలకు పాల్పడింది. బాలికను పెళ్లిచేసుకొని చివరకు కటకటాలపాలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగింది. బుధే బాలాజీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక‌ సోమవారం కనిపించకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. దాంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారికి శివ్‌పురి జిల్లాకు చెందిన ఆ బాలిక‌ బంధువైన మహిళ కూడా మిస్సింగ్ అని విచారణలో తేలింది.

దీంతో కూపీ లాగగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొంతకాలంగా సదరు మహిళ మైనర్ బాలికపట్ల అతి చనువుగా ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ మైనర్‌ను లేవదీసుకుపోయి వివాహం చేసుకున్నట్లు తేల్చారు. పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు మహిళను అరెస్ట్‌ చేశారు. అయితే ఆ బాలిక ఇష్టప్రకారమే పెళ్లి జరిగిందని ఆమె వాదిస్తోంది.

Similar News