దేశంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చండీఘడ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి వేడుకల్లో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తూ చండీఘడ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చండీఘడ్ ప్రాంతంలో పెళ్లి వేడుకల్లో ఎక్సైజ్ శాఖ అనుమతితో మద్యాన్ని సరఫరా చేయవచ్చని కేంద్ర సలహాదారు మనోజ్ పరీడా తెలిపారు. అయితే బార్‌లను మాత్రం మూసి ఉంచాలని ఆదేశించారు.