ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 812 ఉన్నాయి. విదేశాలకు చెందిన కేసుల సంఖ్య 33.
తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16,097కి చేరింది. ప్రస్తుతం 8586 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినుండి 7313 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 198కి చేరింది.