ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 765 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవి 727 ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు 38 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసులు 17,699కు చేరాయి. ప్రస్తుతం 9473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని 8008 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 218కి చేరింది.