ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-06 18:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం ఏపీలో కొత్తగా 1,322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,263 పాజిటివ్ కేసులు ఏపీ రాష్ట్రానికి చెందినవి. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56మందికి కరోనా సోకింది. ఇక విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా సోకింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది. ప్రస్తుతం 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా జయించి 8,920మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి 239మంది మృతి చెందారు.

Similar News