ఓ వ్యక్తికి అంత్యక్రియలు.. మూడు గ్రామాలు లాక్‌డౌన్

Update: 2020-07-05 19:37 GMT

కరోనా వ్యాప్తికి భయపడి అసోంలో మూడు గ్రామాల్లో అధికారులు లాక్ డౌన్ విధించారు. నాగాన్ జిల్లాలో ఇస్లాం మత బోధకుడు మరణించడం.. ఆయన అంత్యక్రియలు జరిపించడంతో.. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఇండియా జమాత్ ఉలేమా అధ్యక్షుడు 87 ఏళ్ల ఖైరుల్ ఇస్లాం అంత్యక్రియలు ఈ నెల 2న జరిగాయి. ఈ కార్యక్రమానికి వేలాదిమంది హాజరైయ్యారు. ఈ కార్యక్రమానికి సంబందించి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దీంతో ఈ వ్యవహారం అధికారుల దృష్టిలో పడింది.

ఇస్లాం ప్రవక్త అంత్యక్రియల్లో 10,000 హజరై ఉంటారని పోలీసులు అంచానా వేస్తున్నారు. దీంతో రెండు కేసులు కూడా వారిపై నమోదు చేశారు. ఈ కార్యక్రమం జరిగిన మూడు గ్రామాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ ఘటనపై ఖైరుల్ ఇస్లాం కుమారుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. తన తండ్రికి చాలా మంది అనుచరులు ఉన్నారని.. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి.. ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు జరిపామని అన్నారు. ఈ కార్యక్రమానికి తక్కువ సంఖ్యలోనే జనం హజరయ్యారని అన్నారు. కాగా.. అసోంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,000కు చేరింది.

Similar News