తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 1879 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో కేవలం గ్రేటర్ హైదరాబాద్ పధిలో 1,422 నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,612 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 11,012 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 16,287 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి ఇప్పటి వరకు 313 మంది మృతి చెందారు.