ఉద్యోగాల భర్తీ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం

Update: 2020-07-07 18:40 GMT

ఉద్యోగాల భర్తీ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో రైల్వే ఆదాయం దాదాపు 58 శాతం మేర తగ్గింది. ఈ క్రమంలో... ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. సేఫ్టీ మినహా మిగతా విభాగాల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు అందేవరకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయొద్దంటూ అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇప్పటికే వివిధ దశల్లో ఉన్ననియామక ప్రక్రియలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది.

Similar News