దేశ రాజధానిలో జరిగే పరీక్షలన్నీ రద్దు: ఉప ముఖ్యమంత్రి

Update: 2020-07-11 18:33 GMT

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని సెమిస్టర్ విశ్వవిద్యాలయాల తుది పరీక్షలను రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు. సంబంధిత విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన మార్కుల జాబితా ఆధారంగా విద్యార్థులకు డిగ్రీ ప్రధానం చేస్తామని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ 19 దృష్ట్యా తుది పరీక్షలతో సహా అన్ని ఢిల్లీ రాష్ట్ర విశ్వ విద్యాలయ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలు నిర్ణయించిన మార్కుల జాబితా ఆధారంగా డిగ్రీ ఇవ్వబడుతుంది.

కాగా, 1.09 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. 3,300 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,000 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇదిలావుండగా కరోనా వైరస్ సంక్షోభం మధ్య ప్రస్తుతం తమ ఇంటర్మీడియట్ సెమిస్టర్లలో ఉన్న విద్యార్థుల పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం గతంలో ప్రకటించింది. విద్యార్థులు గతంలో జరిగిన సెమిస్టర్ లో వారి పనితీరు ఆధారంగా గ్రేడ్ చేయబడతారని వర్శిటీ తెలిపింది. ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పరీక్షలు ఆగస్ట్ వరకు వాయిదా పడ్డాయని పరీక్ష యొక్క కొత్త తేదీలు మరియు సంబంధిత సమాచారాన్ని తర్వాత ప్రకటిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది.

Similar News