కాన్పూర్ లో ఇటీవల ఎనిమిది మంది పోలీసు సిబ్బంది హత్య చేసిన కేసులు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్ కు గురైన వికాస్ దుబే ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరవింద్ రామ్ విలాస్ త్రివేది (46), ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) బృందం శనివారం అరెస్టు చేసింది. అలాగే అతని డ్రైవర్ సుశీల్‌కుమార్ సురేష్ తివారీ (30)ని కూడా థానేలోని కోల్షెట్ రోడ్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
పోలీసులు హత్య తరువాత వెంటనే త్రివేది తన డ్రైవర్‌తో పాటు రాష్ట్రం నుంచి పారిపోయినట్లు మహారాష్ట్ర ఎటిఎస్ చేసిన ప్రాథమిక విచారణలో తేలింది. 2001 లో ఉత్తర ప్రదేశ్ మంత్రి సంతోష్ శుక్లా హత్యతో సహా దుబేతో పాటు త్రివేది అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన అరెస్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బహుమతిని కూడా ప్రకటించింది ”అని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ ఇన్స్పెక్టర్ దయా నాయక్ అన్నారు.