తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ లో ఓ శిధిల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదం ఉదయం వేళ జరగడం తోపాటు ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. శిధిలమై ప్రమాద స్థితిలో ఉన్న తమ భవంతి కూల్చివేతకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేశానని భవన యజమాని తెలిపారు. అయితే కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆవుపానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో రాజమహేంద్రవరంలో పలు చోట్ల ఏళ్ల టాబడి శిధిల స్థితిలో ఉన్న భవంతులు కూలేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.