రాజస్థాన్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే సచిన్ పైలట్ సహా మరో ఇద్దరు మంత్రులను తొలగించిన కాంగ్రెస్.. సచిన్ తోపాటు తనకు సహకరిస్తున్న ఎమ్మెల్యేపై కూడా వేటుకు సిద్ధమైంది. వారిని అనర్హులుగా చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి బుధవారం నోటీసు ఇచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత రెబల్ ఎమ్మెల్యేల వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు.
రెండు రోజులపాటు జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో వివిరణ ఇవ్వాలని
ఆ నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. శుక్రవారంలోపు నోటీసులపై సమాధానం ఇవ్వాలని స్పీకర్ పేర్కొన్నారు.