ఏపీ ఎమ్మెల్యే కారులో నోట్లకట్టలు

Update: 2020-07-16 17:20 GMT

ఆంద్ర తమిళనాడులోని ఏలావూరు చెక్ పోస్ట్ వద్ద ఓ కారులో రూ 5 కోట్ల 27 లక్షల నగదు, భారీగా బంగారం దొరకడం దుమారం రేపుతోంది. ఆ కారుపై ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ఇద్దరు ఒంగోలు, ఒకరిది చిలకలూరిపేటగా గుర్తించారు. అయితే మరో ఇద్దరు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు బంగారు వ్యాపారి

అంటూ ఉదంతాలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటికే చెన్నై ఐటి శాఖ రంగంలోకి దిగింది. కారులో పట్టుబడిన ఆ ముగ్గురిని కూడా విచారిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి కొందరు గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాకం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏలావూరు లోని చెక్ పోస్ట్ దగ్గర తనికీలు చేపట్టగా ఈ సొత్తు దొరికింది.

Full View

Similar News