తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Update: 2020-07-16 09:35 GMT

తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తొర్రూరు మండలం చీటాయపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండా వాసులని తెలుస్తుంది. ప్రమాదానికి అతివేగం, ఓవర్ లోడింగే కారణమని భావిస్తున్నారు.

Similar News