ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ఇప్పటివరకూ పట్టణాలకు పరిమితమైన ఈ మహమ్మారి.. ఇప్పుడు గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో 2602 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 40646కి చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో 2592 మందికి పాజిటివ్ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి 8 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది.ఇప్పటివరకూ 534మంది కరోనాతో మృతిచెందారు.