కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహిళా కానిస్టేబుల్ నిరసన

Update: 2020-07-17 17:46 GMT

కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఓ మహిళా కానిస్టేబుల్ నిరసనకు దిగారు. ఆత్మకూరు సిఐ గుణశేఖర్ వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. నకిలీ విడాకుల పత్రం చూపించి పెళ్లి పేరుతో మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనవద్ద డెబ్భైవేలు తీసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సిఐ గుణశేఖర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు. ఉన్నతాధికారులు సిఐపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. పూర్తి ఆధారాలతో జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసానని అన్నారు లేడీ కానిస్టేబుల్.

Full View

Similar News